Sarath Babu: ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా, సపోర్టింగ్ యాక్టర్ గా, విలన్ గా నటించి మెప్పించిన విలక్షణ నటుడు శరత్ బాబు. ఈయన ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు. విలక్షణమైన నటనతో రెండు వేలకు పైగా సినిమాలలో నటించిన ఘనత ఆయనకి ఉంది.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఆయన పరిస్థితి ఎలా ఉన్నది అనే దానిమీద ఎవరికీ క్లారిటీ లేదు. అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. కానీ నటి కరాటే కళ్యాణి శరత్ బాబు ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
నాకు ఇష్టమైన హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు తొందరగా కోలుకోవాలని మనం స్వామిని వేడుకుందాం.. శ్రీరామరక్ష అంటూ చెప్పుకొచ్చింది. ఇదే స్టేట్మెంట్ వేరెవరైనా ఇచ్చి ఉంటే నెటిజన్స్ సీరియస్ గానే తీసుకొని ఉండేవారు కానీ ఈ పోస్టు కరాటే కళ్యాణి పెట్టడంతో అందరూ ఆమెని దుమ్మెత్తి పోస్తున్నారు.
ఎందుకంటే ఆమె ఇంతకుముందు కూడా నటుడు కోట శ్రీనివాసరావు గారి గురించి ఏమాత్రం విచారించకుండానే పరమపదించారు అంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత స్వయంగా కోట శ్రీనివాసరావు గారి నేను బ్రతికి ఉన్నాను నన్ను ఇలా బ్రతకనివ్వండి అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమో అని నెటిజన్స్ అభిప్రాయం.
అలాగే ఆమెని బాగా ట్రోల్ చేస్తూ మీరు ఇలాంటి పోస్ట్లు పెట్టకండి, మీరు ఎవరిని ప్రార్థిస్తే వాళ్ళు టపా కట్టేస్తున్నారు అంటూ ఒక వ్యక్తి రియాక్ట్ అవ్వడం వైరల్ అయింది. అయితే అందుకు కరాటే కళ్యాణి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. నీకు అర్థమైంది ఇంతే, ముందుగా నువ్వు కోలుకో మానసికంగా బాగోలేవు అంటూ రిప్లై ఇచ్చింది.
Sarath babu:
నేను నాకు తెలిసిన సమాచారం పోస్ట్ చేస్తాను నచ్చకపోతే చూడటం మానేయ్ అంటూ ఆమె తరహాలో స్పందించింది. ఆమె స్వభావం బిగ్ బాస్ లో మనం అందరమూ చూసిందే కదా. అయినప్పటికీ తెలిసి తెలియని పోస్టులు పెడుతున్న కరాటే కళ్యాణి పై నెటిజన్ లు బాగా మండిపడుతున్నారు.