Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మే 22వ తేదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ అక్కడే ఉంటున్నారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో మే 22వ తేదీ తుది శ్వాస విడిచారు. శరత్ బాబు వయసు పై పడటం చేత ఈయనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడాయని తెలుస్తుంది. ఇక చివరికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో మరణించారు.
ఇక శరత్ బాబు నటుడుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా కాస్త ఒడిదుడుకులే ఉన్నాయని చెప్పాలి.నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శరత్ బాబు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అయినప్పటికీ తనకంటూ ఒక వారసుడు కూడా లేకపోవడం బాధాకరం. ఇలా ఎన్నో ఆస్తులు సంపాదించినప్పటికీ ఆస్తులు అన్నీ కూడా తన తోడబుట్టిన వారి పిల్లల పేరిట రాసిచ్చారని తెలుస్తోంది.
Sarath Babu: అక్కడ నివసించడమే ఆయన కోరికనా ..
ఇలా ఒంటరిగా గడుపుతూ సినిమాలలో నటిస్తున్నటువంటి శరత్ బాబు చివరిగా నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో కృష్ణ పాత్రలో నటించారు.ఇక ఈ సినిమా మరో మూడు రోజులలో విడుదలకు సిద్ధమవుతుందన్న నేపథ్యంలో శరత్ బాబు అనారోగ్యంతో మరణించారు. అయితే ఈయనకు తన చివరి కోరిక నెరవేరకుండానే మరణించారని తెలుస్తోంది. శరత్ బాబు ఎప్పటికైనా తనకేంతో ఇష్టమైన హార్సిలీ హిల్స్ లోఓయ్ ఇంటిని నిర్మించుకొని అక్కడ జీవించాలన్నదే తన కోరిక అయితే ఇప్పటికి ఇంకా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నిర్మాణ పనులు పూర్తికాకుండానే శరత్ బాబు మరణించడంతో ఆయన కోరిక అలాగే ఉండిపోయింది అని తెలుస్తుంది. ఇక శరత్ బాబు మరణ వార్త తెలియగానే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయనకు నివాళులు అర్పిస్తున్నారు.