Sarath Babu: సినీ నటుడు శరత్ బాబు వయసు పై పడటంతో గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగుళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఈయన ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉంది. ఇకపోతే తాజాగా మరోసారి ఈయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.గత మూడు రోజులుగా ఎఐజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు.
గత మూడు రోజులుగా వెంటి లెటర్ పైన చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయన ఆరోగ్య విషయంలో ఏమాత్రం మెరుగు కనబడలేదని ఈయన పరిస్థితి మరింత క్షీణించిపోతోందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నారు అలాగే కాలేయం ఊపిరితిత్తులు లివర్ వంటి ప్రధాన అవయవాలు కూడా పూర్తిగా డామేజ్ అయ్యాయని శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కూడా సోకిందని వైద్యులు ప్రకటించారు. ఇలా క్షణం క్షణం ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే మారిందని వైద్యులు తెలియజేశారు.
Sarath Babu: క్షీణిస్తున్న శరత్ బాబు ఆరోగ్యం..
మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం గురించి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ఇలా శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి క్షీణించి విషమంగా మారడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక శరత్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన రామరాజ్యం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈయన తెలుగుతో పాటు కన్నడ మలయాళ తమిళ భాషలలో సుమారు 200కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న శరత్ బాబు అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.