Sarath Babu: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు రామరాజ్యం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనటువంటి ఈయన అన్ని భాషలలో కలిపి సుమారు 200 పైగా సినిమాలలో నటించి మెప్పించారు. అయితే గత కొద్ది రోజులుగా శరత్ బాబు ఆరోగ్యం బాగాలేదని ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే శరత్ బాబు గురించి తాజాగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శరత్ బాబు ముందుగా రమా ప్రభ అనే నటిన వివాహం చేసుకొని దాదాపు 14 సంవత్సరాల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం స్నేహలత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరి కాపురం కూడా సజావుగా సాగలేదు.ఈమెతో కూడా విడాకులు తీసుకోవడంతో ఈయన మూడో వివాహం చేసుకున్నారని అయితే ఆమె ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం శరత్ బాబు ఎప్పుడు వెల్లడించలేదు. అయితే గతంలో నటి నమితతో శరత్ బాబు ప్రేమ ప్రయాణం కొనసాగించారని ఆమెను పెళ్లి చేసుకున్నారంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
Sarath Babu: తప్పుడు వార్తలను ఖండించిన నమిత…
నమిత 2017వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకొని కవల పిల్లలకు గత ఏడాది జన్మనిచ్చారు. అయితే ఈమె పెళ్లి సమయంలో కూడా శరత్ బాబుతో నమితకు ఎఫైర్ ఉందంటూ వార్తలు రాగ ఈ వార్తలపై స్పందించిన నమిత అవన్నీ కేవలం అవాస్తవాలేనని కొట్టిపారేశారు.తనకు శరత్ బాబు అంటే కూడా ఎవరో తెలియదని ఈ వార్తలు వచ్చిన తర్వాత ఆయనని గూగుల్ సెర్చ్ చేయగా తనొక స్టార్ హీరో అని వయసులో తనకన్నా పెద్దవాడు అంటూ ఈమె తన గురించి వచ్చినటువంటి ఫేక్ రూమర్స్ నీ తిప్పి కొట్టారు. ఇక ప్రస్తుతం నమిత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.