Sarika Hassan పాపం డబ్బులు లేక… స్టేజ్ షో లలో నటించే స్థాయికి పడిపోయిన హీరోయిన్ శృతి హాసన్ తల్లి….

Joythi R

Sarika Hassan సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో మనకంటూ మంచి ఫేమ్ మరియు క్రిస్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకాల వేసుకోవాలి. లేకపోతే వయసు మళ్ళిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సీనియర్ నటీనటులు వయసులో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడంతో వయసు మళ్లిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో మరణించినవాళ్లు కూడా లేకపోలేదు.

అయితే తాజాగా ఒకప్పటి తమిళ ప్రముఖ హీరోయిన్ సారిక హాసన్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రేక్షకులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగా తన విడాకుల అనంతరం సినిమాలకు గ్యాప్ తీసుకోవాలని కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్నానని కానీ అది కాస్త దాదాపుగా ఐదేళ్లు పట్టడంతో కొంతమేర ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తాను సంతోషంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు మాత్రం మళ్లీ తనని వైపు నడిపించాయని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు స్టేజి షోలలో కూడా నటించేందుకు సిద్ధపడ్డానని కానీ ఇలా చేయడం వల్ల వచ్చేటువంటి ఆదాయం తనకి ఏమాత్రం సరిపోదని దాంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి తనని తాను సిద్ధం చేsసుకున్నానని తెలిపింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓ ప్రముఖ వెబ్ సిరీస్ లో నటి సారిక హాసన్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. తొందర్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నట్లు సమాచారం.

Sarika Hassan పాపం డబ్బులు లేక... స్టేజ్ షో లలో నటించే స్థాయికి పడిపోయిన హీరోయిన్ శృతి హాసన్ తల్లి....
Sarika Hassan పాపం డబ్బులు లేక… స్టేజ్ షో లలో నటించే స్థాయికి పడిపోయిన హీరోయిన్ శృతి హాసన్ తల్లి….

దీంతో నటి సారిక ఇంటర్వ్యూ చూసినటువంటి కొందరు కొందరు నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు. కాకుండా భర్త మొత్తం ఇండియాలోనే మంచి పేరున్న నటుడని కూతుళ్లు కూడా దాదాపుగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్నారని అలాంటప్పుడు నటి సారిక హాసన్ కి ఇన్ని కష్టాలు ఎందుకని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం వయస్సులో ఉన్నప్పుడు నాలుగు రాళ్ళు సంపాదించు కోకపోతే వయసు మళ్లిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

- Advertisement -