Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి పరిచయం అక్కర్లేదు. డైరెక్టర్ పరుశురామ్ ప్రాణం పోసిన ఈ సినిమాను ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఇక మహేష్ బాబు కీర్తి సురేష్ లు జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వేసుకున్నారు.
ఇక భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ సరసన కీర్తి తన అద్భుతమైన నటనను కనబరిచి తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మహేష్ బాబు కామెడీ టైమింగ్, హీరోయిజం బాగా పండించాడు. దాంతో అభిమానులు, ఇక సినీ లవర్స్ ఈ సినిమాకు భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేశారు.
ఇక కొంతమంది నెగిటివ్ గా కూడా ఈ సినిమా గురించి ప్రచారాలు చేస్తున్నారు. ఇది కూడా మహేష్ బాబు ఇది వరకు నటించిన సినిమా లనే ఉందని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏదైనా తాజా సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డు స్థాయిలో రాబట్టి ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు మరో ముద్దుగుమ్మ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో నటించిన మరో ముద్దుగుమ్మ ఈమనే!
ఇంతకు ఆమె ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే ఆమె పేరు సౌమ్య మీనన్. ఈ ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి కినావల్లి అనే సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాతోనే మలయాళం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఆ పై పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చూసిన వారు ఆ ముద్దుగుమ్మ బయోడేటా వైపు ఒక లుక్ వేస్తున్నారు. మరికొందరు ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నారు.