Sarkaru Vaari Paata: బాబు అంచనాలు తార్‌మార్..ఆడేసుకుంటున్నారుగా..

G K

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీపై బాబు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దానివల్లే భారీ హిట్ ఖాయమని..మళ్ళీ పోకిరి వంటి హిట్ గ్యారెంటీ అని సర్కారు వారి పాట సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. స్వయంగా మహేశ్ బాబు ఇలా చెప్పడంతో అంచనాలు పీక్స్‌లో ఏర్పడ్డాయి. కానీ, ఇప్పుడు ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి..అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేశ్ బాబు నుంచి సర్కారు వారి పాట సినిమా వచ్చింది.

కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. మహేశ్ నుంచి సినిమా వచ్చి చాలా గ్యాప్ రావడంతో ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని అభిమానులు చెప్పుకున్నట్టే, చిత్రబృందం కూడా ప్రచారం చేశారు. అయితే, ఈ రోజు భారీ స్థాయిలో రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. బ్లాక్ బస్టర్ అనుకున్నవారంతా నిరాశకు గురవుతున్నారట.

Sarkaru Vaari Paata: జనాలకు ఎక్కుతుందా లేక అసలు టాక్ తేలిపోతుందా..?

పబ్లిక్ టాక్ కూడా అటు ఇటుగా వినిపిస్తోంది. కొన్ని ప్రాంతాలలో మహేశ్ అభిమానులు కూడా సినిమా కథ, కథనం అంత బాగాలేదని చెప్పుకుంటున్నారట. ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైనర్, సెకండాఫ్ అంతా యాక్షన్ సీన్స్‌తో నింపేశారని..ఇందులో బలమైన కథ, కథనాలేవీ లేవనీ అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. గత కొన్నేళ్ళుగా మహేశ్ ఖాతాలో వరుసగా హిట్స్ వచ్చి పడుతున్నాయి. కానీ, ఇప్పుడు సర్కారు వారి పాట మాత్రం దానికి బ్రేక్ వేసింది. చూడాలి మరి స్లోగా సినిమా జనాలకు ఎక్కుతుందా లేక అసలు టాక్ తేలిపోతుందా.

- Advertisement -