Sarkaru Vaari Paata: తెలుగు ప్రేక్షకులకు సర్కారు వారి పాట సినిమా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాలతో బరిలోకి దిగాడు. డైరెక్టర్ పరుశురామ్ మహేష్ కాంబో లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు పెరిగాయి. ఇక మహేష్ తో అందాలభామ కీర్తి సురేష్ జతకట్టడం తో అంచనాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
కాగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను క్రాస్ చేసింది. కలెక్షన్ ల రూపంలో ఆకాశాన్ని అంటింది. దాంతో మొదటిరోజే మహేష్ అభిమానులు ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉందంటూ ఒక రేంజ్ లో హడావిడి చేశారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒక రేంజ్ లో హౌస్ లో అరుచుకుంటూ హడావిడి చేశారు.
అది ఎందుకంటే? సర్కారీ వారి పాట సినిమాలో సుబ్బరాజు కు పదేపదే హీరో మహేష్ బాబు కాల్ చేస్తాడు. దానివల్ల సుబ్బరాజు ఫోన్ మోగినిప్పుడు లాల బీమ్లా..అనే రింగ్ టోన్ వస్తుంది. ఇక ఈ రింగ్ టోన్ వినబడి నప్పుడల్లా థియేటర్లలో పవర్ స్టార్ అభిమానులు ఒక రేంజ్ లో అరుపులు, కేకలతో హడావిడి చేశారు.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ పెట్టడానికి కారణం ఇదే!
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పాటను ఆ సినిమా లో రింగ్ టోన్ గా ఎందుకు పెట్టారన్న దాని పై డైరెక్టర్ పరుశురామ్ స్పందించాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు గాను డైరెక్టర్ పరుశురాం ఈ విధంగా స్పందించాడు. త్వరలోనే తాను మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తానని, ఇక కళ్యాణ్ ని కలిసి మంచి సినిమా కథ వినిపిస్తా అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని పరశురామ్ వెల్లడించాడు.
ఇక సర్కారు వారి పాట సినిమా లో వేరే రింగ్ టోన్ పెడితే ఆడియో వినిపించడం లేదట. దాంతో నేను తమన్ కలిసి భీమ్లా నాయక్ రింగ్ టోన్ పెట్టాలని డిసైడ్ అయ్యాము అని పరశురామ్ చెప్పుకొచ్చాడు.