Senior Actress Pragati: ప్రముఖ సీనియర్ నేటి ప్రగతి అంటే అందరికీ బాగా తెలుసు. F3 తో బాగా ఫేమస్ అయిన ఆమె ప్రస్తుతం నిత్యం వార్తల్లో కనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరును సంపాదించుకున్న ప్రగతికి సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాలలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు వారు సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించి బుల్లితెరపై జరిగే చిన్న చిన్న షోలలో జడ్జిలుగా కూడా చేస్తున్నారు.
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరైన ప్రగతి గురించి తెలుగు ఇండస్ట్రీలో అందరికీ ఆమె తెలుసు. ఎక్కువగా సినిమాలలో పాజిటివ్ పాత్రలలో కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రగతి ఎక్కువగా హీరోయిన్ తల్లి పాత్రలలో నటిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా ఈమె ఎలాంటి ఫోటోలను షేర్ చేసిన అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.
చాలా సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ప్రగతి ప్రస్తుతం 30 సంవత్సరాలు దాటిన వారిలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జిమ్ లో చాలా కసరత్తులు చేసి ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాక మంచి కామెడీ టైం ఉన్న పాత్రల్లో కూడా ప్రగతి కనిపించింది. రీసెంట్ గా F2, F3 సినిమాలలో హీరోయిన్ తల్లిగా మంచి కామెడీ టైమింగ్ తో కామెడీని పండించింది ప్రగతి.
ఇక ఆమె బుల్లితెరలో కూడా పలు షోలలో స్టెప్పులు వేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆమె ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూ కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రగతి అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
Senior Actress Pragati: బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చిన నటి ప్రగతి..
ఇందులో భాగంగా..వ్యాఖ్యాత ఆర్ కే ప్రగతి కు.. మీరు ఒక మదర్ అయిపోయారు..అయినప్పటికీ ఈ వీడియో లు డాన్స్ లు అవసరమా అంటూ కామెంట్లు వస్తుంటాయి..వాటి పై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. నా వీడియో లకి 90 శాతం మంది వావ్ నువ్వు ఏంటి ఇలా అంటుంటారు.. ఆ 10 శాతం మంది ..ఏనుగు వెళుతుంటే.. మొరుగుతున్నాయి కదా..అని ఏనుగు వెళ్ళడం ఆపదు.. అలాగే నా వీడియో లకి బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి.. కానీ నేను కేర్ చెయ్యను.. అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.