Senior Actress Subhashini: బుల్లి కార్యక్రమాలలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమాలలో క్యాష్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమానికి ప్రతి వారం ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు హాజరవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక పోతే ఈ ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, సుభాషిణి, జెన్నీ హాజరయ్యారు. సీనియర్ ఆర్టిస్టులు అయినప్పటికి వీరి అల్లరితో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా కొనసాగింది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుమ ఎప్పటిలాగే వీరికి సరదాగా ఫన్నీ టాస్క్ లు ఇచ్చి అందరినీ ఎంతో సరదాగా నవ్వించారు.
ఇలా వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇచ్చిన సుమ అందరిని తనదైన శైలిలో సందడి చేశారు. ఇకపోతే ఈ ప్రోమో చివరిలో కాస్తా ఎమోషనల్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సీనియర్ నటి అల్లరి సుభాషిని ఎన్నో సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈమె ఒక సమయంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు.అయితే ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకున్న సుభాషిని ఈ కార్యక్రమం ద్వారా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
Senior Actress Subhashini: సుమ నా బంగారు తల్లి….
ప్రస్తుతం నేను బ్రతికి ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం సుమ అంటూ ఎమోషనల్ అయ్యారు.తనకు ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యానికి అయ్యే ఖర్చు కోసం సుమ సహాయం చేశారు అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనకోసం అమెరికా నుంచి మందులు తెప్పించి నన్ను బ్రతికించిందని ఎమోషనల్ అయ్యారు. నాకు కనుక మరొక జన్మంటూ ఉంటే సుమ నా కడుపున బిడ్డగా పుట్టాలని కోరుకుంటాను అంటూ సుభాషిని ఎమోషనల్ అయ్యారు.సుభాషిని ఇలా చెప్పేసరికి సుమ కూడా ఎమోషనల్ గా తనని కౌగిలించుకోగా సుభాషిని సుమ నుదిటి పై ముద్దుపై పెడుతూ నా బంగారు తల్లివమ్మ అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమోకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.