Tabu: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో రాణించాలంటే మనకి సంబంధం లేనటువంటి విషయాలను పట్టించుకొకపవడంతో పాటూ అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఉంటేనే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. లేకుంటే లేనిపోనీ తలనొప్పి, మనస్పర్థలు, విభేదాలు వంటివి తప్పవు. అయితే ఎక్కువగా చాలామంది నటీనటులు తమ తోటి నటులతో ఉన్నవటువంటి సన్నిహిత సంబంధాలను, స్నేహ బంధాలను వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేసేనప్పడు కొంతమేర ఇబ్బందులను ఎదుర్కుంటుంటారు. ఈ క్రమంలో ఈ టప్పుడు ప్రచారాలను కొంతమంది తేలికగా తెసుకుంటే మరికొందరు మాత్రం తమ కాపురాల్లో చిచ్చు రాజేసుకుని మనస్పర్థలు విబేధాలతో విడాకుల వరకూ వెళ్ళిన సందర్భాలు లేకపోలేదు.
కానీ ఆ నటి మాత్రం తన భర్త విషయంలో వినిపించిన రూమర్లను, గాసిప్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా తన భర్తని అర్థం చేసుకొని చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్న ఒకప్పటి మాజీ తెలుగు హీరోయిన్ అమల గురించి సీనియర్ పాత్రికేయులు ఇమంది రామారావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఇమంది రామారావు ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ కింగ్ నాగార్జున – అమల పెళ్లి బంధం గురించి పలు ఆసక్తి కర విషయాలను ప్రేక్షకులకు తెలియజేశాడు.
ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీలో మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను అప్పుడప్పుడు వక్రీకరించి ప్రచారాలు చేయడం మరియు వారి మధ్య ఏదో ఉందంటూ లేనిపోనివి కల్పించి రూమర్లు గాసిప్స్ వంటివి క్రియేట్ చేయడం ఎప్పటినుంచో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో నటుడు నాగార్జున మరియు మాజీ తెలుగు హీరోయిన్ టబుల మధ్య కూడా లవ్ ఎఫైర్ ఉందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయని చెప్పుకొచ్చాడు.
కానీ నాగార్జున మరియు టబులు మాత్రం మంచి స్నేహితులని ఈ క్రమంలో నిన్నే పెళ్ళాడుతా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారని తెలిపాడు. అయితే అప్పట్లో నాగార్జున మరియు టబుల మధ్య లవ్ ఎఫైర్ ఉందని నాగార్జున భార్య అమలకు తెలిసినప్పటికీ ఆమె ఏమీ అనలేదని అలాగే తన భర్త గురించి తనకు బాగా తెలుసని కాబట్టి అందులో అనుమానించాల్సిన పనిలేదని రెండు, మూడు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిందని తెలిపారు. అలాగే నాగార్జున మరియు అమల ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉందని అందువల్లనే ఇప్పటికీ నాగార్జున అమల కలిసి ఉన్నారని లేకపోతే నాగార్జున విషయంలో వినిపించిన రూమర్లకి అమల కనుక స్పందించి ఉంటే ఈపాటికి ఎప్పుడో విడాకుల తీసుకునేవాళ్ళని పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు.