Serial Actress: అబ్బో.. ఆ సీరియల్ నటి లగ్జరీ ఇల్లు చూసారా.. ఎంత బాగుందో?

Akashavani

Serial Actress: బుల్లితెర ప్రియులకు యాక్టర్ అష్మిత కర్ణని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సీరియల్స్ లో చీర కట్టుకొని మన పక్కింటి ఆడపడుచులా.. సీరియల్స్ లో తన నటనను కనబరుస్తుంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో పాపులర్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.

దాదాపు తెలుగు బుల్లితెర పై 15 సీరియల్స్ కు పైగా నటించి బుల్లి తెర పై నటనలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఆ ఫేమ్ తోనే క్రమంగా వెండితెరపై అడుగుపెట్టింది. పలు సినిమాల్లో సహ నటిగా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఆమె కొరియోగ్రాఫర్ సుధీర్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక గత కొంత కాలం నుంచి నటనకు దూరంగా రష్మిత సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్ లు నెట్టింట్లో పంచుకుంటుంది. ఇక తాజాగా అదే క్రమంలో రష్మిత తన హోమ్ టూర్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ క్రమంలో తన ఇంటి లోపల బాగానే చూపిస్తూ ఇల్లంతా బ్లాక్ అండ్ వైట్ ఉండేలా జాగ్రత్త పడ్డాము అని చెప్పుకొచ్చింది.

Serial Actress: అబ్బో.. ఆ సీరియల్ నటి లగ్జరీ ఇల్లు చూసారా.. ఎంత బాగుందో?
Serial Actress: అబ్బో.. ఆ సీరియల్ నటి లగ్జరీ ఇల్లు చూసారా.. ఎంత బాగుందో?

 Serial Actress: రష్మిత తన ఇంట్లో కిచెన్ కి ఈ ఏర్పాటు కూడా చేసింది!

ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ఎంతో అందంగా మార్చి.. చాలా మంచి గా రూపు దిద్దుకున్నామని తెలిపింది. ఇక ఇంట్లో ఫర్నిచర్స్ ఎక్కడా కొనకుండా సపరేట్ గా ఒకచోట తయారు చేయించుకున్నామని ఆమె వెల్లడించింది. అంతే కాకుండా ఇంట్లో కి ఎవరైనా గెస్ట్ లు వచ్చినప్పుడు కిచెన్ మూసేయడానికి ఒక స్లైడింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేసుకున్నామని రష్మిత తెలిపింది.

ఇక ఇల్లు మరింత అందంగా కనిపించే విధంగా మూలల్లో మొక్కలు అమర్చాము అని చెప్పుకు వచ్చింది. ఇక హాల్ కిచెన్ తో పాటు తనకు ఒక బెడ్ రూమ్ తన భర్తకి ఒక బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం అని రష్మిత తన హోమ్ టూర్ వీడియోలో తెలిపింది. ప్రస్తుత ఈ వీడియో యూట్యూబ్ లో తెగ హడావిడి చేసింది.

- Advertisement -