Serial actress: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం బాగానే ఎక్కువైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటి వాటిని ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. కానీ ఇదే అదును గా చేసుకున్న కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించడం, అలాగే వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంవంటివి చేస్తున్నారు.
అంతటితో ఆగకుండా నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకర మెసేజ్లు చేస్తూ వేధించడం వంటివి కూడా చేస్తున్నారు. దీంతో సినీ సెలబ్రిటీల సైతం ఇలాంటి ఆకతాయిలవల్ల పోలీసులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే తాజాగా తమిళ సీరియల్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవీణ ఓ ఆకతాయి వేదింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే నటి ప్రవీణ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. అయితే గత కొద్ది కాలంగా నటి ప్రవీణ కూతురయిన గైరీ నాయర్ ని వాకతాయి సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన మెసేజ్లు అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తనతో చాటింగ్ చేయాలని అలాగే నగ్నంగా వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ మాట్లాడాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తానని అసభ్యకరంగా మెసేజెస్ చేస్తున్నాడు. దీంతో నటి ప్రవీణ కి ఈ విషయం తెలియడంతో వెంటనే దగ్గర్లో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఆకతాయిపై ఫిర్యాదు చేసింది.
రంగం లోకి తగిన పోలీసులు ఆకతాయి ఎవరా అని కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందుతడు ఉపయోగించిన సెల్ ఫోన్ అలాగే కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది. దాంతో అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతున్న యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
అయితే ఈ యువకుడు గతంలో కూడా నటి ప్రవీణ ని పలుమార్లు వేధించాడు. ఈ క్రమంలో జైలుకెళ్ళి బెయిల్ పై బయటకి వచ్చాడు. కానీ నటి ప్రవీణ పై ఉన్నటువంటి కక్ష కారణంగా ఆమె కూతురుని ఇలా టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేశాడని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.