Serial Actress: మామూలుగా భర్తలు భార్యలను టార్చర్ చేస్తూ ఉంటారు. ఏదైనా కట్నం కోసం, లేదా మరి ఏదైనా సంబంధం కోసం భార్యలకు బాగా నరకం చూపిస్తూ ఉంటారు. దీంతో భార్యలు తట్టుకోలేక సూసైడ్లు వంటివి చేసుకుంటారు. లేదంటే ఇల్లు వదిలి వంటరి జీవితాన్ని గడుపుతారు.
కానీ ఇప్పుడు తరం మారింది. భార్యలు తిరిగి భర్తలకే నరకం చూపిస్తున్నారు. ప్రతి విషయంలో అనుమానిస్తూ భర్తలను బాగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ నటి కూడా తన భర్తను అలాగే వేధించింది. ఇంతకు ఏం జరిగిందంటే.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ నటి.. బుల్లితెరపై పలు సీరియల్స్ లలో నటించింది. చాలావరకు అత్త, వదిన పాత్రలలో నటించింది.
ఇక ఆమెకు నటనపరంగా మంచి గుర్తింపు రావడంతో వెండితెరపై కూడా అటువంటి పాత్రలలో అవకాశాలు వచ్చాయి. అయితే ఈమె సీరియల్స్ లలో ఎంత మంచి పాత్రలలో నటిస్తుందో వ్యక్తిగతంగా మాత్రం అంత విలనిజం చూపిస్తుంది. తన భర్తను బాగా ఇబ్బంది పెడుతూ.. ఆయనకు నరకం చూపిస్తుంది.
మంచి బిజినెస్ చేసే ఆమె భర్త.. ఆమె పట్ల ఎంతో గౌరవాన్ని చూపిస్తాడు. అంతేకాకుండా ఆమెను చాలా ప్రేమించేవాడు కూడా. అయితే ఆమె మాత్రం తన భర్తను అసలు పట్టించుకోదు. అంతేకాకుండా ఆయన సంపాదించిన డబ్బు మొత్తాన్ని తన చేతిలో పెట్టాలి అని డిమాండ్ కూడా చేస్తుంది. కొన్ని కొన్ని సమయాలలో ఆయనను బాగా టార్చర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Serial Actress: చివరికి మరో ఆమెను పెళ్లి చేసుకున్న ఆ నటి భర్త..
దీంతో అతడు ఈ విషయాలను ఎవరికీ చెప్పకుండా తానే బాధపడ్డాడు. అయినా కూడా ఆమె అలాగే ప్రవర్తించడంతో.. చివరికి అతడు తన భార్యతో ఉండటం కరెక్టు కాదు అని.. మరో ఆమెను పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని గడుపుతున్నాడు. ఇక ఈ సీరియల్ నటి మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇక ఈమె క్యారెక్టర్ ఇలా అని తెలియటంతో ఇండస్ట్రీలో కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయి.