Shaakuntalam: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం శాకుంతలం. సమంత ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైథలాజికల్ డ్రామా జానర్ లో రూపొందిన ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ సమీపించటంతో ప్రమోషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ చిత్ర బృందం ప్రమోషన్ పనులను మొదలు పెట్టింది. హీరోయిన్ సమంతతో పాటు దర్శకుడు గుణశేఖర్ కూడా వరుస ఇంటర్వ్యు లలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
అంతే కాకుండా గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ కూడా సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నీలిమ గుణ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నీలిమా గుణ శాకుంతలం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న వార్త గురించి క్లారిటీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పాత్ర పోషించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నీలిమ గుణ ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
Shaakuntalam: ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నాం…
ఈ విషయం గురించి స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు. తారక్ గురించి నాన్న గొప్పగా చెప్పేవారని తెలిపింది. ఇక శాకుంతలం సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించలేదని ఆమె తెలిపారు. ఈ సినిమాలో దుశ్యతుండి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ ను అనుకున్నట్లు టాక్. అయితే సినిమాలో దుశ్యంతుడి పాత్ర పరిమితం కావడంతో ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ను పరిశీలించలేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్నాయి.