Shaakuntalam: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల యశోద సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించింది. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.ఇక శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈసినిమాను ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తాజగా మొదలుపెట్టారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శాకుంతలం టీం తాజాగా జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. సమంతతో పాటు ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్, దర్శకుడు గుణ శేఖర్ సహా మరికొంత మంది టీమ్.. పెద్దమ్మ గుళ్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Shaakuntalam: భరతుడి పాత్రలో అల్లు అర్హ…
ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించాడు. ఇక అల్లు అర్జున్ కూతురు అర్హా కూడా ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. చిన్నారి భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా , విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యశోద తో హిట్ కొట్టిన సమంత శాకుంతలం తో మరో హిట్ కొడుతుందో? లేదో? చూడాలి మరి.