Shaakuntalam: సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని సమంత కెరియర్ లోనే ఇలాంటి డిజాస్టర్ సినిమా లేదని పలువురు ఈ సినిమా పై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి రావు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇందులో సమంత నటన చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. అలాగే పురాణాలు గురించి తెలిసిన వారికి మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుందని తెలిపారు.
ఈ సినిమాలో సమంత నటన బాగాలేదు అనేవాళ్ళు తప్పకుండా అక్కినేని నాగచైతన్య అభిమానులు అయి ఉంటారని వాళ్లుకుమాత్రమే సమంత నటన నచ్చలేదు మిగతా అందరికీ సమంత నటన అద్భుతంగా నచ్చిందని అరోహి రావు వెల్లడించారు.ఇక చైల్డ్ ఆర్టిస్ట్ అర్హ గురించి కూడా మాట్లాడుతూ ఆమె నటన బాగుందని అయితే అంతకన్నా అద్భుతంగా నటించే చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు అంటూ ఆరోహిరావు పేర్కొన్నారు.
Shaakuntalam: అర్హ కన్నా బాగా నటించేవారు ఉన్నారు…
మొత్తానికి ఈ సినిమా బాగాలేదు అని చెప్పలేము కానీ యావరేజ్ గా ఉందని కానీ బయట మాత్రం ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోహి రావు శాకుంతలం సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.అయితే ఈ విషయంపై స్పందించిన అక్కినేని అభిమానులు అరోహి పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే అర్హ కన్నా ఇంకా బాగా నటించే చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉన్నారనడంతో బన్నీ అభిమానులు కూడా ఈమెపై నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మొత్తానికి ఆరోహి రావు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.