Shaakunthalam: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా సమంత కెరియర్ లోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన సినిమాగా చెప్పాలి ఈ సినిమా ద్వారా ఈమె మొదటిసారి పౌరాణిక చిత్రాలలో నటించారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ఇదివరకే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం చిత్ర బృందం ముంబైలో సందడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.అన్న నందమూరి తారక రామారావు నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన బంగారు కిరీటాన్ని ధరించారు. అయితే దీనిని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా శాకుంతలం సినిమాలో అన్ని నిజమైన బంగారు వజ్రాల ఆభరణాలను ఉపయోగించానని ఈయన తెలియజేశారు. ఈ సినిమా కోసం అన్నీ కూడా చేతితో తయారు చేసిన నగలను డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో ఈ నగలను సుమారు 7 నెలల పాటు డిజైన్ చేశారని గుణశేఖర్ వెల్లడించారు.
Shaakunthalam 15 కిలోల బంగారం ధరించిన సమంత…
ఇక ఈ సినిమాలో సమంత సుమారు 15 కిలోల బంగారు వజ్రాభరణాలను తయారు చేశామని సుమారు 14 రకాల నగలను డిజైన్ చేశామని గుణశేఖర్ తెలిపారు. ఇక దుష్యంతుడి పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారు నగలను తయారు చేయించినట్లు గుణశేఖర్ తెలిపారు.ఇక ఈ సినిమాలో నటీనటుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన నగలకు సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కారణంగా నేపథ్యంలో శకుంతల దుష్యంతుడు ధరించిన నగలను హైదరాబాదులోని వసుంధర జ్యువెలర్స్ లో ఆవిష్కరించారని గుణశేఖర్ వెల్లడించారు.