Shakeela: వెండితెర నటిగా శృంగార తారగా ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచు గుర్తింపు సంపాదించుకున్నటువంటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు అనంతరం అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా అవకాశాలు తగ్గిపోయినటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షో లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమానికి రావడానికి ముందు షకీలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మెదట్లో ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డానని తెలిపారు. తన కారణంగా తాను ప్రెగ్నెంట్ అయ్యానని షకీలా షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే తాను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు అసలు తెలియదు నాకు కడుపు పెరగడంతో మా అమ్మకు అనుమానం వచ్చి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళింది.
ఇంకా రిలేషన్ లో ఉన్నారా…
ఇలా డాక్టర్ వద్దకు వెళ్లగా డాక్టర్ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పినప్పుడే నేను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నాకు తెలిసిందని షకీలా తెలియచేశారు అయితే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో అమ్మ వెంటనే తనకు అబార్షన్ చేయించిందని షకీలా తెలిపారు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయిన సమయంలో నాకు బిడ్డను కనే వయసు కూడా లేదు అలాగే ఆ బిడ్డ పుట్టిన లోపాలతో పుడుతుందన్న కారణంతోనే అబార్షన్ చేయించామంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికీ ఆ అబ్బాయితో ఈమె రిలేషన్ లో ఉన్నానని చెబుతూ మరో షాక్ ఇచ్చారు.