Shakuntalam : స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా శాకుంతలం. ఈ సినిమా రిలీజ్‌కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆపుతున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ న్యూస్ అన్నిచోట్లా వినిపిస్తోంది. దీనికి కారణం దిల్ రాజు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేసేందుకు గాను హక్కులను సొంతం చేసుకోవడమే. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ సినిమాకు నిర్మాత. మహాభారంలోని ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోంది.
శాకుంతలం, దుష్యంత మహారాజుల ప్రణయగాధను గుణశేఖర్ తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నారు. అల్లు అర్జున్ కూతురు ఆల్లు అర్హ ఈ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు అంటూ అటు సమంత ఇటు ఆమె అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇంకా ఈ సినిమా సీజీ వర్క్‌లోనే ఉంది. సమంత పాత్రను మలచడంలో తలమునకలై ఉన్నారు గుణ అండ్ టీమ్. పైగా ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కూడా రావడం లేదు.
Shakuntalam : దిల్ రాజు రష్ చూసి డిసప్పాయింట్..?
ఆమధ్య, నిర్మాణంలో భాగమైన దిల్ రాజు కొంత భాగం రష్ చూసి డిసప్పాయింట్ అయినట్టు వార్తలొచ్చాయి. అప్పటి నుంచే శాకుంతలం రిలీజ్ విషయం తన చేతిలో పెట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఈపాటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ, సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ పూర్తి కాలేదు. దాంతో 2023, సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని గుణశేఖర్ భాస్తునారట. కానీ, దిల్ రాజు మాత్రం అప్పుడైతే పెద్ద సినిమాల పోటీ ఉంటుందని..ఈ ఏడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో.