Shakuntalam: వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత తాజాగా తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం మొత్తం ప్రస్తుతం ముంబైలో సందడి చేస్తున్నారు.సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి మొట్టమొదటి పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమాపై చిత్ర బృందం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే సమంత ఈ సినిమాలో శకుంతల పాత్రలో నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఇక చిన్నప్పటి భరతుడి పాత్రలో అల్లు అర్హ సందడి చేయనున్నారు.
ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాధానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ… శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రలో నటించడం కోసం ముందుగా నటుడు దేవ్ మోహన్ ని కలవలేదని తెలిపారు. ఈ సినిమాలో ఈ పాత్రలో నటించడానికి ముందుగా నటుడు దుల్కర్ సల్మాన్ ను సంప్రదించామని తెలిపారు. అయితే ఆయన అప్పటికే సీతారామం సినిమాకు కమిట్ అయ్యారు.
Shakuntalam:
ఇలా ఈ సినిమాకు కమిట్ అవ్వడంతో డేట్స్ క్లాష్ అవుతున్న కారణంగా దుల్కర్ సల్మాన్ స్థానంలోకి నటుడు దేవ్ మోహన్ వచ్చారని తెలిపారు.ఇలా ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ దుల్కర్ సల్మాన్ అని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈ సినిమాకు ఒప్పుకొని ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో తెలుగు హీరోలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పరభాష హీరోలకు గుణశేఖర్ ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి అని పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమాలో పరభాష హీరోలను తీసుకోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలిపారు.హీరోయిన్ ప్రాధాన్యత సినిమా అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు నటించడానికి ఆసక్తి చూపించరు అందుకే ఈ సినిమాలో తెలుగు హీరోలకు బదులు పరభాష హీరోలను ఎంపిక చేసినట్లు తెలిపారు.