Shaakuntalam : సమంత ఎడా పెడా వరుసగా సినిమాలను కమిటవుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో విడాకులయ్యాక తన మీద పోటీ అనేట్టుగా ఇలా తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా సమంతకు క్రేజ్ ఉంది. అటు తమిళం, ఇటు తెలుగు ఇండస్ట్రీలలో తన డేట్స్ కోసం మేకర్స్ బాగానే పోటీ పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనివిధంగా సమంత ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా చేయడానికి అసలు ఆలోచించకుండా సై అనడమే.
ఈ విషయం పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే అందరూ ఫిక్సైయ్యారు. అంతేకాదు, హాలీవుడ్ సినిమాలో లెస్బియన్ రోల్ చేయడానికి డేర్‌గా కమిటవడం కొంతమందిని షాక్‌కు గురి చేసింది. ఇక సమంత కెరీర్‌లో మొదటిసారి నటించిన పౌరాణిక సినిమా శాకుంతలం. ఇది గుణశేఖర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ. గుణశేఖర్ అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనే రూపొందిస్తారు. అయితే, ఆయనకు సక్సెస్ రేట్ తక్కువే. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అంటే ఒక్కడు ఒక్కటే. సినిమాలు అద్బుతమైన కథ కథనాలతో తెరకెక్కుతాయి. కానీ, ఎందుకనో జనాలకు మాత్రం ఆయన సినిమాలు ఎక్కడం లేదు.
Shakunthalam: రిజల్ట్ తేడా కొడితే మాత్రం సమంత బాగా ఫీలవుతుంది..?
గత చిత్రం రుద్రమదేవి ఫలితం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ శకుంతల – దుష్యంతుల ప్రేమ కథను వెండి తెరమీదకు తీసుకురావలనుకున్నారు. అలా శాకుంతలం మొదలైంది. అయితే, ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా రష్ చూసిన దిల్ రాజుకు అంతగా నచ్చలేదట. అవుట్‌పుట్ విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యాడని తాజాగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సమంతకి ఈ సినిమా అవుట్‌పుట్ అంతగా శాటిసిఫై అనిపించలేదని..అనవసరంగా ప్రాజెక్ట్ కమిటయ్యానా అని ఫీలవుతున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజంగా శాకుంతలం రిజల్ట్ తేడా కొడితే మాత్రం సమంత బాగా ఫీలవుతుంది.