Shakuntlam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన సినిమా శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వెలువడ్డాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా ఈనెల 17న విడుదల చేయనున్నట్లు గతంలో ఈ సినీ బృందం ప్రకటించారు. నిజానికి ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండేది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. దీంతో ఈ నెల 17న వస్తుందని ప్రకటించి మళ్లీ ఇప్పుడు వాయిదా వేశారు. ఇక ఈ సినిమా మరోసారి వాయిదా వేయటానికి సమంతనే కారణం అని కొందరు అనుకుంటున్నారు.
గత కొన్ని రోజుల నుండి సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా తన సినిమా విషయంలో ఏ మాత్రం వెనుకడగకుండా బెడ్ పై పడుకొని కూడా యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది. అయితే ఇప్పటికీ అలాగే ఉన్న కూడా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో సమంత పాల్గొనడానికి ముందుకు వచ్చినా కూడా డైరెక్టర్ గుణశేఖర్ మాత్రం వాయిదా వేసినట్టు తెలిసింది.
Shakuntlam
నిజానికి కారణం సమంత కాదు అని.. అసలు కారణం వేరేది ఉంది అని.. అది కూడా విజువల్ వండర్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఇంకా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురుచూసిన అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు అనిపించింది. ఇక గుణశేఖర్ మాత్రం ఆలస్యంగా వచ్చిన పర్లేదు కానీ గ్రాఫిక్స్ చూపించాలన్న ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది.