Shalini Pandey: డెబ్యూ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించి ఈ సినిమాతో మంచి బ్రేక్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ సంపాదించుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ ఈయన సరసన నటించిన శాలిని పాండే పరిస్థితి మాత్రం దరిద్రంగా మారిందనే చెప్పాలి.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీఇచ్చింది శాలిని పాండే. ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది. అలా నిశ్శబ్దం, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి పలు సినిమాలలో నటించింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా షావుకారు జానకిగా నటించి బాగా ఆకట్టుకుంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా నటించింది. అక్కడ తన నటనకు తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది. టాలీవుడ్ లో అవకాశాలు కోసం గ్లామర్ షో తో ఫోటో షూట్ లు చేయించుకుంటూ తెగ రెచ్చిపోతుంది. సినిమా అవకాశాల కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది. ఏకంగా తన అందాలతో బాగా గ్లామర్ షో చేస్తుంది.
Shalini Pandey: వామ్మో.. శాలిని పాండే ఫోటోలు చూడండి ఎలా అయిందో..
ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బాగా వర్కౌట్లు చేసి స్లిమ్ గా మారిపోయింది. ఆమె ఫోటోలను చూస్తే మాత్రం ఇలా అయ్యిందేంటి అని అనకుండా ఉండలేరు. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు అందుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి జాడలు కూడా కనిపించడం లేదని చెప్పాలి.