Shankar: కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తన కూతురుకి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడిగా శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, అర్జున్, విక్రం లాంటి స్టార్‌లతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇండియన్ 2, రాం చరణ్‌తో ఆర్సీ 15, హిందీలో రన్వీర్ సింగ్‌తో అపరిచితుడు హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ఆర్సీ 15 షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను సెప్టెంబర్ 13 నుంచి మొదలు పెట్టబోతున్నారు.

ఇక హిందీ అపరిచితుడు మొదలవ్వాల్సి ఉంది ఇదిలా ఉంటే శంకర్ తన కూతురుని హీరోయిన్‌గా ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ఓ సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా హారయ్యారు. తన కూతురు హీరోయిన్‌గా నటిస్తున్న విషయాలపై కూడా శంకర్ మాట్లాడుతూ తను మంచి స్థాయికి చేరుకోవాలని కాంక్షించారు. అయితే, ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం తన కూతురుకి శంకర్ వార్నింగ్ ఇచ్చారట.

Shankar: తండ్రీకూతుళ్ళిద్దరికీ చిన్న వాగ్వివాదం..?

నువ్వు ఏ హీరోతో సినిమా చేసినా ఒకే గానీ, శింబు సరసన మాత్రం నటించవద్దని..అలాంటి అవకాశం వస్తే అంగీకరించవద్దని చెప్పారట. కానీ, అదితి మాత్రం తండ్రి మాటను లెక్క చేయకుండా శింబు హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తానని పట్టుపట్టిందట. ఈ విషయంలో తండ్రీకూతుళ్ళిద్దరికీ చిన్న వాగ్వివాదం కూడా జరిగిందట. ఎందుకంటే హీరోయిన్స్ విషయంలో శింబుపై ఉన్న ఆరోపణలు తెలిసిందే. ఇదిలా ఉంటే శంకర్ కోరుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయి తన కూతురు శింబు సరసన నటించే అవకాశం అటకెక్కిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే శంకర్ చెప్పింది మరోలా నెరవేరినట్టు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఆగస్ట్ 16, 2022 at 11:30 ఉద.