Shanti Priya: ఈమధ్య చాలామంది సీనియర్ నటీనటులు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు ఉన్న పాత్రలలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇప్పటికీ కొంతమంది నటీమణులు రీ ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ తో మరోసారి పరుగులు తీస్తున్నారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనుంది.
ఇంతకు ఆమె ఎవరంటే నిశాంతి. ఈమె ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన భానుప్రియ చెల్లెలు. ఇక నిశాంతిని శాంతి ప్రియ అనే పేరుతో పిలుస్తారు. ఇక ఈమె 1990లో కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అత్త కోసమే అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన శాంతి ప్రియ.
అయితే ఈమె గతంలో మంచి హోదాలో ఉన్న సమయం లో పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అలా కొంతకాలం పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈమె ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించింది. దీంతో ఇటీవలే ఆమె రి ఎంట్రీ ఇవ్వగా ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్లో నటించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత కూడా నటించినప్పటికీ తన నటనలో ఎటువంటి తేడా లేదు.
Shanti Priya: తెలుగు భాషల్లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్న శాంతి ప్రియ..
ఆ సిరీస్ లో నటించినందుకు తనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఆ సీరిస్ లో తన నటనకు ప్రశంసలు అందుకోవటం ఆనందంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం సరోజినీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రానున్న సరోజినీ నాయుడు ది అన్ సాంగ్ ఫ్రీడమ్ ఫైటర్ అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిపింది. ఇక తమిళంలోనే కాకుండా తెలుగు భాషలో కూడా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపింది.