Sharath Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు పూర్తికాకుండానే మరో విషాదం చోటుచేసుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శరత్ బాబు ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్ను మూసినట్లు వైద్యులు ప్రకటించారు.
గత కొంతకాలంగా శరత్ బాబు వయసు పైబడటం చేత సినిమాలకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడాయి. ఇదివరకు బెంగళూరులో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న శరత్ బాబు తాజాగా తన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎఐజి ఆసుపత్రికి తీసుకువచ్చారు. గత కొద్దిరోజులుగా ఇక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
Sharath Babu:శరత్ బాబు ఇకలేరు…
శరత్ బాబు అనారోగ్యం కారణంగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో ఈయన పరిస్థితి మరింత విషమించిందని తెలుస్తుంది.ఇలా శరత్ బాబు మరణించారనే వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే సినీ సెలెబ్రిటీలు శరత్ బాబు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. రామరాజ్యం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా తెలుగు తమిళ కన్నడ భాషలలో ఈయన సుమారు 200 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.