Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా గుర్తింపు పొందిన శర్వానంద్ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ కొన్ని నెలల క్రితం బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి రక్షిత రెడ్డి అనే యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు పూర్తి అయింది.
శర్వానంద్, రక్షిత రెడ్డిని నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇది కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా కొంతకాలంగా శర్వానంద్ పెళ్లి గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు పూర్తి అయిన కూడా ఇప్పటివరకు పెళ్లి గురించి ప్రస్తావించకపోవడంతో శర్వానంద్ నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం జరిగిన కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ వారి నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు రూమర్లు వినిపించాయి.
Sharwanand: సినిమా షూటింగ్ పూర్తి అయ్యాకే పెళ్లి…
అయితే శర్వానంద్ పెళ్లి గురించి తాజాగా ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. శర్వానంద్ రక్షిత రెడ్డి మధ్య ఎటువంటి గొడవలు లేదా లేవని వారు నిశ్చితార్థం రద్దు చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శర్వానంద్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల పెళ్లిని కొంతకాలం వాయిదా వేశాడని, సినిమా షూటింగులు పూర్తయిన తర్వాత పూర్తిగా పెళ్లి మీదే ఫోకస్ చేస్తాడని వారు తెలిపారు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో శర్వానంద్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 40 రోజులపాటు లండన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.