Shiva Jyothi: యాంకర్ శివ జ్యోతి అనే పేరు కంటే తీన్మార్ సావిత్రక్క అంటే చాలు వెంటనే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. తన మాట తీరుతో తెలంగాణ ప్రేక్షకులను ఫిదా చేసింది. తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ద్వారా న్యూస్ యాంకర్ గా పరిచయమైంది. అందులో తను మాట్లాడే విధానం, చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక తనతో పాటు మరో యాంకర్ బిత్తిరి సత్తి కూడా అందరికీ తెలిసిందే. ఇక అతనితో తమ్ముడు అనుకుంటూ బాగా సందడి చేసేది. అలా మనకు పరిచయమైన సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. ఈమెకు గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది. ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందాలని కొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.
ఇక అలా v6 లో తీన్మార్ సావిత్రిగా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది. ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది. ఇక సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి
బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది. మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు ఫోటోలు బాగా పంచుకుంటుంది. ఒక యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని ఇప్పటికి చాలా వీడియోలు పంచుకుంది. అయితే తాజాగా తన కొత్త ఇల్లు కూలిపోయింది అన్న విషయాన్ని కూడా తెలిపింది.
Shiva Jyothi: ఇల్లు కూలిపోయిందంటూ అంటూ ఆవేదనం వ్యక్తం చేసిన శివ జ్యోతి..
తన అత్తగారి కోసం ఒక ఇల్లు కట్టిస్తుంది సావిత్రి. అయితే ఆ ఇంటి ఇంటీరియర్ ఫెయిల్ కావటంతో బాగా కోపం వ్యక్తం చేసింది. దీంతో అదంతా వీడియో తీసి.. సీలింగ్ సరిగ్గా లేదంటూ.. కూలిపోవడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా తలుపులకు, బాత్రూంలో స్టిక్కర్లు కూడా అతికించేసారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.