Shiva Jyoti: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ శివ జ్యోతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అచ్చం తెలంగాణ బిడ్డలా తన కట్టు బొట్టుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను మరో స్థాయిలో మెప్పిస్తూ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ త్రీ కి ఎంపికైంది.
కాగా ఈ షో లో శివ జ్యోతి రన్నర్ గా నిలిచినప్పటికీ టాప్ 6కంటెస్టెంట్ గా నిలిచింది. బిగ్ బాస్ కి వెళ్ళిన అనంతరం శివ జ్యోతి మరో స్థాయిలో పాపులర్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేతినిండా ఆఫర్లతో బిజీ గా హడావిడి చేస్తుంది. ఇక శివజ్యోతి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది.
ఇదే క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ తో నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ఆ ఛానెల్ లో శివ జ్యోతి తన నల్లి బొక్కలు దావత్ వీడియో ని పంచుకుంది. కాగా పిస్తా హౌస్ రెస్టారెంట్ ప్రకటించిన అన్లిమిటెడ్ బఫేట్ గురించి వివరించింది. ఇందులో భాగంగా రెస్టారెంట్ వంటకాలను వివరిస్తూ మటన్ లివర్ గురించి చెప్పుకుంటూ గలీజ్ గా కిడ్నీ అంటే బాగోదు అని.. అందుకే లివర్ అంటారు అని చెప్పుకొచ్చింది.

Shiva Jyoti: శివ జ్యోతి పరువు తన భర్త నెటిజన్ల ముందు ఈ విధంగా తీసాడు!
ఇక పక్కనే ఉన్న తన భర్త కిడ్నీ వేరు, లివర్ వేరు అని జ్ఞానోదయం చేశాడు. దీంతో ఈ వీడియోలో శివ జ్యోతి లూప్ హోల్ ను పట్టుకున్న నెటిజన్లు ఆమెను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కిడ్నీకి లివర్ కు తేడా తెలియదా అంటూ ఏకి పారేస్తున్నారు. ప్రస్తుతం శివ జ్యోతి వీడియో యూట్యూబ్ లో తెగ హడావిడి చేస్తోంది.