Shivabalaji: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ బాలాజీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నటువంటి నటి మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.ఇలా ఎన్నో అడ్డంకులను ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు వచ్చాయని తెలిపారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివ బాలాజీ మధుమిత తమ జీవితం గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పెళ్లి తర్వాత జీవితం కొనసాగించడం అంటే సులభమైన పని కాదని ఇది చాలా కష్టమని మధుమిత తెలియజేశారు. పెళ్లి తర్వాత కూడా మా ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు వచ్చాయని మధుమిత వెల్లడించారు.
Shivabalaji: కండిషన్లు ఎక్కువయ్యాయి…
ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ ప్రేమించుకున్నప్పుడు మేమిద్దరం దూరంగా ఉండటంతో ఇద్దరి మధ్య ఎంతో మంచి అండర్ స్టాండింగ్ ఉండేది అయితే పెళ్లయిన తర్వాత ఇద్దరు ఒకే చోట ఉండడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని తెలియజేశారు. తాను ఫ్రెండ్స్ తో కలిసి తరచూ బయటకు వెళ్లేవాన్ని అయితే ఆ సమయంలో తనకు కండిషన్స్ ఎక్కువ అయ్యాయని దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవని శివ బాలాజీ తెలిపారు.అప్పటికే మాకు బాబు కూడా పుట్టారని ఈ మనస్పర్ధలు కారణంగా చివరికి విడాకులు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. అయితే మా కజిన్ రావడం ఇద్దరినీ కొద్దిరోజులు వేరువేరుగా ఉండమని చెప్పగా అలాగే వేరుగా ఉన్నామని ఆ సమయంలోనే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరం ప్రేమ మాకు తెలిసి కలిసిపోయామని ఈ సందర్భంగా శివ బాలాజీ వెల్లడించారు.