Shobana Kamineni: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం అయినటువంటి 11 సంవత్సరాలకు ఈమె తల్లి కావడంతో మెగా కుటుంబంలోనూ ఇటు కామినేని కుటుంబంలోనూ సంతోషం వేల్లు విరిసింది. ఇక మెగా ఇంటికి మెగా ప్రిన్సెస్ రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి ఉపాసన సరాసరి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళింది. అక్కడే చిన్నారి నామకరణ మహోత్సవ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా అనే పేరును కూడా పెట్టినట్లు మెగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇలా డెలివరీ తర్వాత చిరంజీవి ఇంట్లోనే ఉన్నటువంటి ఉపాసన మొదటిసారి తన కూతురితో కలిసి తన తల్లి గారి ఇంటికి వెళ్లారట అయితే 11 సంవత్సరాల తర్వాత తల్లి అయినటువంటి తన కూతురు తన మనవరాలితోపాటు రావడంతో ఉపాసన తల్లి శోభన కామినేని ఎంతో ఘనంగా తన మనవరాలకు స్వాగతం పలికారని తెలుస్తోంది. ఇలా తవ మనవరాలు మొదటిసారి ఇంట్లోకి అడుగుపెడుతున్నటువంటి శుభ తరుణంలో ఈమె గ్రాండ్ వెల్కమ్ చెప్పారట.
Shobana Kamineni: బంగారంతో పాదముద్రలు…
తన కూతురికి మనవరాలికి దిష్టి తీసినటువంటి వ్యక్తికి శోభన ఏకంగా లక్ష రూపాయల డబ్బు ఇచ్చారని తెలుస్తుంది. అదేవిధంగా మొదటిసారి తన మనవరాలు ఇంట్లోకి రావడంతో తన పాదముద్రులను అలాగే చేతిముద్రలను తీసుకొని వాటిని బంగారంతో చేయించి ప్రేమ్ కట్టించి భద్ర పరిచబోతున్నట్టు తెలుస్తుంది.ఇలా 11 సంవత్సరాల తర్వాత తన కూతురు తల్లి కావడంతో శోభన కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.