ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో హడావుడి చేసిన హాట్ బ్యూటీ శ్రియ శరన్. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నడూ వెనుకకు తిరిగి చూడకుండా దూసుకొచ్చింది. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు సొంతం చేసుకుంది. ఇక గతంలో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చినా శ్రియ.. మళ్లీ రీఎంట్రీ తో వరుస సినిమాలతో ఓ రేంజ్ లో బిజీ అయిపోయింది.
ఇక శ్రియ ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పాలి. ముఖ్యంగా తన అందం, ఫిజిక్ విషయంలో మార్పు రాలేదు. పెళ్లయి ఒక పాప ఉన్నా కూడా తనలో అందం మాత్రం తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా పోస్టులు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి బాగా వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో.. పెళ్లయ్యాక కూడా మీరు అందంగా ఉండటానికి కారణం ఏంటని జర్నలిస్ట్ శ్రియ ను ప్రశ్నించింది. దాంతో శ్రియ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు కనిపించింది. తన ఫ్రెండ్స్ కూడా తనను చాలా మంది మెచ్చుకున్నారు అని.. బిడ్డ పుట్టక కూడా ఇంత అందంగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నామని అన్నారని అన్నది.
Shriya Saran
కానీ ఇక్కడ అందం ఒకటే ముఖ్యం కాదంటూ.. తన వయసు ఎంత.. ఇండస్ట్రీలో ఎంతకాలం నుంచి ఉంటున్నాను.. అనేదే ముఖ్యం అని.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు లేదు. ఈ ప్రశ్న ఇండస్ట్రీలోని హీరోలని అడిగిన రోజున నేను కూడా దీనికి సమాధానం చెబుతాను అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు అనిపించింది. అయితే ఓ నేటిజన్ షేర్ చేసిన ఆమె వీడియో ద్వారా మరోసారి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.