Shriya Saran 40 ఏళ్ల వయసులో కూడా బికినీ వేసి పిచ్చెక్కిస్తున్న తెలుగు హీరోయిన్… చూస్తే అస్సలు ఆగరు…

Joythi R

Shriya Saran తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరు స్టార్ హీరోల సరసన నటించి కుర్రకారు మతి పోగొట్టినటువంటి తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియ శరణ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటి శ్రియ శరణ్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తదితర భాషలలో కూడా నటించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వయసు పైబడినటువంటి హీరోలకు హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అయిపోయింది. దీంతో నటి శ్రియ శరణ్ కి ఈ విషయం బాగానే కలసివస్తోంది. దీంతో 6 పదుల వయసు దాటినటువంటి హీరోలకి ఈ అమ్మడు మంచి ఆప్షన్ గా మారింది. దాంతో దర్శక నిర్మాతలు కూడా నటి శ్రియ శరణ్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో నటి శ్రియ శరణ్ వేసవి సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తన కూతురుతో కలిసి బీచ్లు, పార్కులు అంటూ సరదాగా గడుపుతోంది. అయితే తాజాగా నటి శ్రియ శరణ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో నటి శ్రియ శరణ్ తన కూతురుతో కలిసి బీచ్ లో జలకాలాడుతూ కనిపించింది. అలాగే ఈ అమ్మడు స్వింసూట్ ధరించి దర్శనమివ్వడంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు.

అంతేకాకుండా నటి శ్రియ శరణ్ అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు. మరికొందరు మాత్రం నటి శ్రియ శరణ్ కి 40 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నప్పటికీ అందం ఏమాత్రం తగ్గడం లేదని అలాగే వన్నె తరగని అందంతో ఇప్పటికీ పిచ్చెక్కిస్తుందని కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి మహిళ ఇలా బహిరంగంగా అర్ధనగ్న పోజు ఇవ్వడం సరికాదని కాబట్టి వెంటనే ఫోటోలను డిలీట్ చేయాలని కోరుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి శ్రియ శరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళం, హిందీ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా చిత్రాలలో నటిస్తోంది. దీంతో 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ నటి శ్రియ శరణ్ కి అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -