Shruthi Hassan: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ మాతృభాష తమిళ్ కంటే తెలుగులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి వరుస హిట్ల అందుకున్న ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు దూరం అయింది. ఆ తర్వాత ఇటీవల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంది. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శృతిహాసన్ తాజాగా బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి ఒకేసారి రెండు హిట్లు అందుకుంది.
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇలా శృతిహాసన్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన ప్రియుడుతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారిద్దరికీ సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించింది.
Shruthi Hassan: తనే నా ఫస్ట్ క్రష్…
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ కి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అన్న ప్రశ్న ఎదురవగా.. ఏ మాత్రం ఆలోచించకుండా టక్కున హాలీవుడ్ నటుడు బ్రూస్లీ అంటూ శృతిహాసన్ సమాధానం చెప్పింది. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంది.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఒకేసారి డబుల్ హిట్స్ అందుకున్న శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది.