Shruti Haasan: శృతిహాసన్ కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనంతరం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి స్టేజ్ లో ఉన్న సమయంలోనే తన వ్యక్తిగత కారణాలవల్ల శృతిహాసన్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఈమె రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా అనంతరం వరుస సినిమా అవకాశాలతో శృతిహాసన్ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈమె హీరో ప్రభాస్ సరసన పాన్ ఇండియా స్థాయిలో సినిమాలో నటిస్తున్నారు. ఇదే కాకుండా చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ విధంగా శృతిహాసన్ చిరంజీవి బాలకృష్ణతో కలిసి నటిస్తున్నారని తెలియగానే ఈమె గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.తనకు అవకాశాలు లేకనే ఇలా తమ తండ్రి వయసున్న హీరోలతో కలిసి నటిస్తుందంటూ కొందరు దారుణమైన ట్రోల్స్ చేశారు.
Shruti Haasan ప్రతిభ ఉంటే మరణించే వరకు నటించవచ్చు…
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన గురించి ట్రోల్ చేసిన వారికి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత నటించడానికి వయసుతో సంబంధం లేదని తెలిపారు వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమేనని, మనలో నటించగలిగే ప్రతిభ సత్తా ఉంటే మరణించే వరకు నటించవచ్చని ఈమె తెలిపారు.అయితే ఇదివరకే ఎంతోమంది హీరోలు తమకన్నా వయసులో సగం తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో కలిసి నటించారు. అందుకు తాను కూడా ఏమీ అతీతం కాదని ఈ సందర్భంగా ట్రోలర్స్ కు శృతిహాసన్ గట్టిగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.