Kamal Hassan : తండ్రేమో కరోనాతో బాధపడుతుంటే..కూతుళ్ళేమో పార్టీలు చేసుకుంటున్నారు..

Bharath Cine Desk

Kamal Hassan : భారతీయ విలక్షణ నటుడు, స్టార్ హీరో కమల్ హాసన్ కు ఇటీవల కరోనా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై వైద్యులు అప్డేట్స్ ఇస్తు ఉన్నారు. తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యం బాగానే ఉందని.. కరోనా నుండి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కమల్ హాసన్ కూతుళ్లు శృతిహాసన్, అక్షరహాసన్ మన అందరికి సుపరిచితమే..అయితే వీరిద్దరి వ్యవహారం అసలు బాగోలేదు..ఇటు తండ్రి కరోనాతో బాధపడుతుంటే..అటు కూతురు లేమో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో శృతిహాసన్ ముంబైలోని ఒక ప్లాట్ లో తన బాయ్ ఫ్రెండ్ హజారికాతో కలిసి ఉంటుంది. ఈ మేరకు శృతిహాసన్ హజారికాతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షర హాసన్ తన అక్క అయిన శృతిహాసన్ ప్లాట్ కి రావడంతో వారు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకున్నారు. ఈ మేరకు హజారికా బొమ్మలు గీస్తూ తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. కానీ ఇద్దరు అక్కాచెల్లెళ్లు శృతిహాసన్ అక్షర హాసన్ లు తిండి పైనే దృష్టి పెట్టారు.

ఆ తర్వాత ముగ్గురు బెడ్ పై దొర్లుతూ సెల్ఫీ లకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలో వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పాపం తండ్రేమో కరోనా తో బాధపడుతుంటే.. మీరు ఇలా పార్టీలు చేసుకుంటున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే.. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5 ని హోస్ట్ చేస్తున్నా కమల్ హాసన్ కరోనా బారిన పడడంతో… సీనియర్ నటి రమ్యకృష్ణ షో ని హోస్ట్ చేయబోతున్నారు. గతంలో తెలుగు బిగ్ బాస్ లో నాగార్జున విహారయాత్ర కాని విదేశాలకు వెళ్లినప్పుడు.. రమ్యకృష్ణ నే షో ని హోస్ట్ చేసింది. ఇండియాలో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ని రెండు భాషలో హోస్ట్ చేసింది రమ్యకృష్ణ మాత్రమే..

- Advertisement -