Shruti Haasan: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ రీ ఎంట్రీ తో వరుస సినిమాలతో అది కూడా స్టార్ హీరోల సరసన ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు క్రేజ్ మామూలుగా లేదని చెప్పవచ్చు. అది కూడా నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సినిమాలలో నటించగా.. ఈ సంక్రాంతికి బాలయ్య, చిరంజీవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక బాలయ్యతో వీర సింహారెడ్డి సినిమాలో నటించగా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లో నటించింది. ఇక ఈ సినిమాలు సంక్రాంతిన సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ సినీ బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా ఉంది. ఇక చిరంజీవి సినిమా కంటే ముందుగా బాలయ్య సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
అయితే నిన్న వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో బాలయ్య, శృతిహాసన్ తో పాటు సినీ బృందం మొత్తం పాల్గొనగా ఈ ఈవెంట్ జోరుగా కొనసాగింది. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడిన మాటలు, శృతిహాసన్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ బాలయ్య క్యారెక్టర్ గురించి కూడా కొన్ని కామెంట్లు చేసింది.
Shruti Haasan: బాలయ్య గోల్డెన్ హార్ట్ అంటున్న శృతిహాసన్..
బాలయ్య అందరికీ ఎలాగో తనకు కూడా అంతే ఫేవరెట్ అని.. ఈ సినిమాకు ముందు గాడ్ ఆఫ్ మాసేస్ బాలయ్య అని విన్నాను అని.. కానీ ఆయన చాలా కూలెస్ట్ పర్సన్ అని తెలిపింది. అంతేకాకుండా సూపర్ ఎనర్జీతో కూడిన సో పాజిటివ్ మెంటాలిటీ అని పొగిడింది. ఇక ఆయన వైపు చూస్తూ గోల్డెన్ హార్ట్ ఉన్న రియల్ సింహం మీరే అంటూ మరింత పొగిడింది. ఇక ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టం అని చెప్పగా ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.