Shruti Hassan: కోలీవుడ్ నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి బాగానే క్లిక్ అయినటువంటి నటీమణులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అలాగే సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాల నుంచి నటన రంగంలో అడుగుపెట్టి మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆఫర్ల విషయంలో కష్టాలు పడుతూ లేస్తూ ఉన్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఉదాహరణకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా కెరేర్ ప్రారంభించిన కొత్తలో పలు డిజాస్టర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా తమ నటన ప్రతిభతోపాటు శరీర ఆహార్యం కూడా చేంజ్ చేసుకుంటూ ప్రస్తుతం స్టార్ పొజిషన్లో ఉన్నారు.
అయితే కోలీవుడ్ ప్రముఖ హీరో కమల్ హాసన్ కూతురు మరియు ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. కాగా ఈ అమ్ముడు కూడా కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో అడపాదడ పా చిత్రాల్లో నటించినప్పటికీ ఆ చిత్రాలు కాస్త డిజాస్టర్లు కావడంతో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ అమ్మడి కెరీర్ టర్న్ అయింది. దీంతో గబర్ సింగ్ చిత్రం తర్వాత నటి శృతిహాసన్ కి ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించే ఆఫర్లతో పాటు భార్య రెమ్యూనిరేషన్ కూడా అందింది.
అయితే ఇటీవల నటి శృతిహాసన్ తెలుగులో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య మరియు మరో స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీరమసింహారెడ్డి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు ఈ ఎడాది సంక్రాంతి కానుకగా విడుదలకాగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రాల్లో నటించిన హీరోల వయసు మరియు నటి శృతి హాసన్ వయసుకి చాలా భేదం ఉండటంతో కొంతమంది ఈ విషయం పై శ్రుతి హాసన్ ని నెగిటివ్ గా ట్రొల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో తాజాగా నటి శృతిహాసన్ ఈ విషయం పై స్పందించింది. ఇందులో భాగంగా నటిగా ఉన్నప్పుడు తాను ఎవరితో నటించడం సరే తన పాత్రకి న్యాయం చేసేట్లు ఉండాలని అంతే కానీ వయసుతో సంబంధం లేదని స్పష్టం చేసింది అలాగే తాను మూడు ఏళ్ల తర్వాత గ్యాప్ తీసుకుని సినిమాలో చేశానని అయినా తనను ప్రేక్షకులు చాలా ఆదరించారని తెలిపింది. ఇక వాల్తేరు వీరయ్య మరియు వీరమసింహారెడ్డి చిత్రాల్లో తన పాత్ర చిన్నది అయినప్పటికీ మంచి స్కోపు ఉందని అందుకే ఈ రెండు సినిమాలు చేశానని కూడా క్లారిటీ ఇచ్చింది.