Shruthi Hassan: అందాల నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్స్ అందుకుంది. శృతిహాసన్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినప్పటికీ ఆమెకు టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు లభించింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ మళ్లీ రీ యంట్రి ఇచ్చి వరుస హిట్స్ అందుకుంటూ మంచి ఫామ్ లో ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా ప్రియుడుతో ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సినిమాలోని ఒక పాట గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Shruthi Hassan: హీరోలకు జాకెట్ ఇస్తారు…
ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ..’మంచులో చలికి డాన్స్ చేయటం చాలా కష్టం. మంచులో డాన్స్ చేయటానికి హీరోలు చలిని తట్టుకునేలా జాకెట్స్ ఇస్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం చీర జాకెట్ లో గడ్డ కట్టిన మంచులో డాన్స్ చేయాలి. అలా చేయటం చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి హీరోయిన్స్ విషయంలో అలాంటివి ఆపేయాలి ‘ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక పాటకి మంచులో షూటింగ్ చేశారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ శృతి హాసన్ ఇలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇకపై అయినా దర్శకులు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారో లేదో చూడాలి మరి.