Shyam : స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్ అన్న….

Joythi R

Shyam కొంతమంది నటీనటులకు మంచి ప్రతిభ ఉన్నప్పటికీ అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలలో ఇరుక్కోవడంతో కెరియర్ ని చిక్కుల్లో పడే చేసుకున్నటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన రేసుగుర్రం చిత్రంలో హీరో అల్లు అర్జున్ అన్న గా నటించిన కన్నడ నటుడు శ్యామ్ కూడా ఈ కోవకే చెందుతాడు.

కాగా నటుడు శ్యామ్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రలలో నటించి బాగానే అలరించాడు. కానీ అనుకోకుండా ఆ మధ్యన శ్యామ్ చెన్నైలో కేసులో పోలీసులకు చిక్కాడు. దీంతో అప్పటి నుంచి నటుడు శ్యామ్ కెరియర్ కొంత మేర డౌన్ అయింది.

అయితే తాజాగా నటుడు శ్యామ్ కి తమిళంలో మరో ప్రముఖ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించే అవకాశం వరించింది. కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు నటుడు శ్యామ్ ని సాదరంగా సినిమా షూటింగ్ సెట్స్ కి ఆహ్వానిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా నటుడు శ్యామ్ కి సరైన అవకాశాలు రాకపోవడంతో తన ప్రతిభను నిరూపించుకోవడానికి స్కోప్ లేకపోయింది. కానీ ఉన్నట్లుండి విజయ్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం రావడంతో మళ్లీ తన సినీ కెరీర్ పై ఆశలు చిగురించాయి.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు శ్యామ్ తెలుగులో దాదాపుగా 20కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు. అయితే ఇందులో రవితేజ హీరోగా నటించిన కిక్, వీర, అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. అంతేకాకుండా నటుడు శ్యామ్ కి కూడా బాగానే గుర్తింపు తెచ్చిపెట్టాయి.

- Advertisement -