Silk Smitha: సిల్క్ స్మిత అనే పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఎందుకంటే ఆమె తన గ్లామర్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన కళ్ళతో ఎంతోమందిని ఆకర్షించింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో శృంగార తారలో ఒకరిగా నిలిచింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించింది.
తొలిసారిగా 1979 ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించింది. చాలా వరకు ఈమె శృంగార పాత్రలలో నటించింది. ఇక ఈమె ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’ అనే పాటతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అలా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించింది. దాదాపు 200 పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక రెండు మూడు సినిమాలలో మంచి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలోనే నటించింది సిల్క్ స్మిత. ఈమె గతంలో ఎన్నో పుకార్లు ఎదుర్కొంది. ఎన్నో సంబంధాలు పెట్టుకుందని బాగా వార్తలు వినిపించాయి. కానీ ఏ రోజు కూడా వాటి గురించి స్పందించలేదు సిల్క్ స్మిత. అలా చివరి వరకు ఒంటరి జీవితాన్ని గడిపింది.
ఇక 1996 సెప్టెంబర్ 23న మద్రాసులో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి సరైన సాక్ష్యం లేకపోవటంతో తాను అలా చేసుకోవడానికి కారణం ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని.. ఇండస్ట్రీలో నష్టాలు ఎదురుకుందని అలా ఎన్నో రకాలుగా వార్తలు రాశారు.

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయాక తనకోసం వచ్చిన స్టార్ హీరో ఇతడే..
కానీ ఈమె జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయని గతంలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇక సిల్క్ స్మిత తను చనిపోతే తనను చూడటానికి ఒక స్టార్ హీరోని రమ్మన్నదట. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు.. అర్జున్. ఇక ఈమె చనిపోయినప్పుడు సినీ ప్రముఖులు ఎవరు కూడా రాకపోగా అర్జున్ మాత్రం ముందుగానే వచ్చాడట.
అయితే ఈయన గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. ఆమె చనిపోయినప్పుడు రావడానికి కారణం ఒకటుందని.. ఆమెతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో.. ఆమె తనతో మంచి స్నేహితురాలుగా ఉందట. ఇక ఆ సమయంలో ఆమె తనతో.. నేను త్వరలోనే చనిపోతున్నాను.. నేను చనిపోయాక నన్ను చూసేందుకు వస్తావా అని అడగటంతో వెంటనే ఆమెను ఎందుకు అలా అంటున్నావు అని మందలించాడట. కానీ నిజంగా తాను నిజంగానే చనిపోయి అందరికీ షాక్ ఇచ్చింది అని అన్నాడు అర్జున్.