Simran: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తన నటనకు గాను చెరగని ముద్ర వేసుకుంది. ఇక అప్పటి ప్రేక్షకుల సిమ్రాన్ ఒక రేంజ్ లో ఊపిందని చెప్పవచ్చు.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. మొత్తానికి సిమ్రాన్ నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. తెలుగు ఇండస్ట్రీకి ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ సిమ్రాన్ మాత్రం ఫ్రెషర్స్ స్టఫ్ లో ఒక భాగం అని చెప్పవచ్చు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి అద్భుతమైన హిట్లను తన సొంతం చేసుకుంది.
అనంతరం సిమ్రాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి ఊహించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. చాలా వరకు ఈ అమ్మడు నటించిన సినిమాలో బాలీవుడ్ లో ఫెయిల్ అయ్యాయని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిమ్రాన్ హీరో రజనీకాంత్ సరసన పెటా సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Simran: ఆ వీడియోలో సిమ్రాన్ ను చూసిన నెటిజన్లు ఈ విధంగా అడుగుతున్నారు!
ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటుంది. కాగా తాజాగా నెట్టింట్లో సిమ్రాన్ పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో 46 సంవత్సరాలు ఉన్న సిమ్రాన్ 26 సంవత్సరాలు ఉన్న యువతి లా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ సిమ్రాన్ కి సంబంధించిన ఆ వీడియో ట్విట్టర్ ఖాతాలో హడావిడి చేస్తోంది. ఇక నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ సిమ్రాన్ గ్లామర్ పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు. దానికి కారణాలు ఏమిటని? నెటిజన్లు కామెంట్ల రూపంలో సిమ్రాన్ అడుగుతున్నారు. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్కెయ్యండి.