Singer Chinmayi: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సింగర్ గా ఎంత పాపులర్ అయిందో సోషల్ మీడియాలో ఆమె చేసే విమర్శల వల్ల కూడా అంతే పాపులర్ అయింది. ముఖ్యంగా మీటు సమయంలో పలువురు సెలబ్రిటీల గురించి చిన్మయి చేసిన వ్యాఖ్యల వల్ల బాగా పాపులర్ అయింది. అంతేకాకుండా సమంత నాగచైతన్య విడిపోవడానికి కూడా చిన్మయే కారణమని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత కాపురంలో చిచ్చు పెట్టడం వల్లే సమంత ఆమెను దూరంగా పెట్టినట్లు కూడా తెలుస్తోంది. తాజాగా సమంత నాగచైతన్య విడాకులకు చిన్మయే కారణమని మరొకసారి వార్తలు తెరపైకి వచ్చాయి.
సమంత కుటుంబ సభ్యులతో కన్నా స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేది. ఏ మాయ చేసావే సినిమాలో సమంతకి చిన్మయి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవటంతో అప్పటి నుండి సమంత నటించిన అన్ని సినిమాలలోనూ చిన్మయి డబ్బింగ్ చెప్పేది. ఇలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే సమంత నాగచైతన్య మధ్య మనస్పర్ధలు వచ్చిన సమయంలో చిన్మయి మాటలు విని సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు కూడా అదే వార్తలు మరొక సారి తెరపైకి వచ్చాయి. దీంతో పలువురు నెటిజన్స్ చిన్మయి పట్ల విమర్శలు కురిపిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
Singer Chinmayi: సమంత కాపురంలో చిచ్చు…
ఈ ట్రోలింగ్ గురించి స్పందించిన చిన్మయి..’ ఇలాంటి మూర్ఖులను అస్సలు పెళ్లి చేసుకోకండి అమ్మాయిలు.. వీళ్ళు పెద్ద ఎదవలు.. ఇలాంటి కుటుంబంలోకి మీరు కనుక వెళ్ళినట్లయితే మీ బతుకు సర్వనాశనమే అవుతుందని ‘ కౌంటర్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ చిన్మయి మీద మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నీ వల్లే సమంత, నాగచైతన్య పచ్చని కాపురంలో చిచ్చు రేగి అందమైన ఆ జంట విడిపోయారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సమంత విడాకుల విషయంలో చిన్మయి పేరు మరోసారి తెరపైకి వచ్చింది.