Nayantara : ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం బాగా ఎక్కువ అవ్వడంతో చాలామంది సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీటిద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వేడుకలు జరిగినా ఎలాంటి విషయమైనాసరే వీటి ద్వారానే పంచుకుంటున్నారు. దీంతో కొందరు ఆకతాయిలు, సినీ సెలబ్రిటీల ఫోటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేయడం అలాగే మార్ఫింగ్ చెయ్యడం, అలాగే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు.
అయితే తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నయనతార సోషల్ మీడియా మాధ్యమాలకి కొంత పేరు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో చాలామంది లైక్ చేసి కామెంట్లు చేశారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు నయనతార ప్రైవేటు శరీర భాగాలపై అసభ్యకర కామెంట్లు చేయడం అలాగే ట్రోలింగ్ చేయడం వంటివి చేస్తున్నారు.
ఈ విషయాన్ని నయనతార పట్టించుకోలేదు. కానీ ప్రముఖ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మాత్రం ఈ విషయంపై సీరియస్ అయింది. అంతేకాకుండా కొందరు నెటిజన్లు నయనతార ఎదబాగాలపై చేసిన కామెంట్లను చూసి అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకంగా నయనతార ప్రైవేట్ శరీర భాగాలపై కామెంట్లు చేసిన వాళ్ళు చిన్నప్పుడు తమ తల్లితో పాలు తాగలేదా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
అలాగే ఎదుటి వ్యక్తుల పై చేసేటువంటి కామెంట్లు కారణంగా తమ ఇంట్లో వాళ్లకి అనవసరంగా ఇబ్బందులు కలుగుతాయని అలాగే చాలామంది కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తారని కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కొందరు నెటిజన్లు సింగర్ చిన్మయ చేసిన ఈ పనికి అభినందిస్తున్నారు.