Singer Koti: అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అంటూ సింగర్ పార్వతిపై ఫైర్ అయిన కోటి!

Akashavani

Singer Koti: సింగర్ పార్వతి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొంత మందికి పరిచయం లేకపోవచ్చు.. కానీ ఊరంతా వెన్నెల అనే పాట పాడిన కోయిల అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఈమె కాకిలా ఉందని కామెంట్ చేసినా పట్టించుకోకుండా పట్టుదలతో పాట పడడం నేర్చుకుంది. తన పాటతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది.

ఆఖరికి తనని కాకి అని పిలిచిన వారి నోటి నుంచి కోకిల అనిపించి పిలిపించుకునే స్థాయికి ఎదిగింది. ఇక మొత్తానికి సింగర్ పార్వతి ఆ పాటతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగువెలుగుతుంది. మరి పార్వతి కి ఇంత గుర్తింపు వచ్చినప్పటికీ తాను ఏ మాత్రం తన స్వార్థం కోసం చూసుకోలేదు.

తన గ్రామస్తులు తాను పడ్డ కష్టాలు పడకుండా.. ఆమె గ్రామం నుంచి పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించేలా చేసింది పార్వతి. దీంతో ఆ ఊరి గ్రామస్తులను సైతం సింగర్ పార్వతి ఫిదా చేసింది. ఇక ఈ విషయం తెలిసిన తరువాత సెలబ్రేటీలు కూడా సింగర్ పార్వతిని మరో లెవెల్లో మెచ్చుకున్నారు.

Singer Koti: అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అంటూ సింగర్ పార్వతిపై ఫైర్ అయిన కోటి!
Singer Koti: అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అంటూ సింగర్ పార్వతిపై ఫైర్ అయిన కోటి!

Singer Koti: సింగర్ పార్వతి డేంజర్ జోన్లో ఉందని చెప్పడానికి కారణం ఇదే!

ఇదిలా ఉంటే సింగర్ పార్వతి తాజాగా డేంజర్ జోన్ లో ఎంటర్ అయింది. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల సరిగమప కార్యక్రమంలో జెడ్జ్ కోటి పార్వతి మీద సీరియస్ అయ్యాడు. ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతావు అంటే డేంజర్ జోన్లో కి వెళ్ళావు ఏమిటి అని కోపంగా విరుచుకుపడ్డాడు.

అదే క్రమంలో మేము మాత్రమే కాదు. మొత్తం తెలుగు ప్రజలంతా నీ పై ఆశలు పెట్టుకున్నారు అని కోటి కోపం వ్యక్తం చేస్తాడు. దాంతో సింగర్ పార్వతి ఫోన్లు నిద్ర ఉండకపోవడం వల్ల సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయాను అని చెప్తుంది. దాంతో అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అని అని కోటి విరుచుకుపడ్డాడు.

- Advertisement -