Singer Kousalya: నీకోసం సినిమాతో సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన కౌసల్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలోనూ ఈమె పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు క్లాసికల్ సాంగ్స్ కి ఈమె పెట్టింది పేరు. ఈమె సింగర్ గా కంటే పర్సనల్ విషయాల ద్వారానే ఎక్కువగా లైం లైట్ లో ఉండేవారు.
కెరియర్లో దూసుకుపోయిన కౌసల్య వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవటం బాధాకరం. తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే కెరియర్ని సక్సెస్ ఫుల్ గా మలుచుకోవడంలో కౌసల్య విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. ఈమె తన భర్త నుంచి విడిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆమెకి ఒక కొడుకు కార్తికేయ కూడా ఉన్నాడు. అతని వయసు 18 సంవత్సరాలు.
తను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్నానని ఆ కష్టానికి ప్రతిఫలం తన కొడుకు అని.. తన కొడుకు తనని తండ్రి లాగా ప్యాంపర్ చేస్తాడని చెప్పుకొచ్చింది కౌసల్య. తన భర్తతో తను విడిపోయినటికీ కొడుకు చాలా చిన్న వాడని.. తన కొడుకుని దృష్టిలో పెట్టుకొని భర్తతో విడిపోవడానికి చాలా ఆలోచించానని.. కానీ విడిపోక తప్పలేదని తెలిపింది కౌసల్య.
తనకి తన చెల్లెలు చాలా ధైర్యాన్ని చెప్తుందని, ఆమెకి చాలా సహనం అని తన జీవితంలో చెల్లెలికి ఉన్న స్థానాన్ని గురించి చెప్పుకొచ్చింది. సహనంగా ఉంటే సంసారం బాగవుతుంది అంటారు కానీ నా విషయంలో అదే పెద్ద తప్పు అయింది అంటుంది కౌసల్య. ఇప్పుడు తన కొడుక్కి 18 సంవత్సరాల అని తన కొడుకు నుంచి తనకి అంతులేని ప్రేమ దక్కుతోందని ఆనందపడుతుంది కౌసల్య.
Singer Kousalya:
తన కొడుకు తనని పిల్లా అని పిలుస్తాడని, చేసిన త్యాగాలు చాలు మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నాడని చెప్పుకొచ్చింది కౌసల్య. కొడుకు మాటలకి గర్వంగాను ఆనందంగానూ ఫీల్ అవుతుందంట కౌసల్య. అయితే తనకి కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని కానీ మనసుకు నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదని చెప్పుకొచ్చారు.