Singer Mangli: సింగర్ మంగ్లీ ఒకప్పుడు జానపద పాటలు పాడుతూ ప్రవేట్ వీడియోస్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ ద్వారా షేర్ చేయడంతో ఈమె పాటలకు ఎంతో మంచి ఆదరణ వచ్చేది. ఇలా రోజురోజుకు మంగ్లీ క్రేజ్ పెరగడంతో ఆమెకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. దీంతో ఈమె క్రేజ్ దృష్టిలో ఉంచుకున్నటువంటి సంగీత దర్శకులు ఈమెకు ఏకంగా సినిమాలలో కూడా పాటలు పాడే అవకాశం కల్పించారు. ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ సింగర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి మంగ్లీ కొన్నిసార్లు పలు వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారు.
గతంలో ఓసారి బోనాలు పాటలు పాడి అమ్మవారిని కించపరిచే విధంగా సింగర్ మంగ్లీ పాట ఉంది అంటూ పెద్ద ఎత్తున ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంలో సింగర్ మంగ్లీ క్షమాపణలు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరోసారి శివరాత్రి పండుగ సందర్భంగా ఒక పాటను చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వివాదానికి కారణం అయింది. ఈ పాటను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిత్రీకరించినట్టు ఇందులోని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
Singer Mangli: రెండు దశాబ్దాలుగా చిత్రీకరణలకు అనుమతి లేదు…
సాధారణంగా గత రెండు దశాబ్దాలుగా ఈ ఆలయంలో ఎలాంటి షూటింగులకు చిత్రీకరణకు అనుమతి లేదు. అలాంటిది ఏమాత్రం గుట్టు చప్పుడు లేకుండా మంగ్లీ ఇక్కడ ఆలయంలో ఈ పాటను చిత్రీకరించడంతో ఇది కాస్త వివాదానికి దారితీస్తుంది.సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటను మంగ్లీ పాడుతూ ఒక వీడియోని కూడా చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె కాలభైరవస్వామి విగ్రహం వద్ద నృత్యం చేసిన విజువల్స్ ఆ పాటలో ఉన్నాయి. నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో మంగ్లీ నృత్యం చేసినట్టు ఈ వీడియోలో ఉండడంతో స్థానిక ప్రజలు ఎవరికి ఆలయంలో షూటింగ్ చేయడానికి అనుమతి లేదు అలాంటిదే సింగర్ మంగ్లీకి ఎలా అనుమతి దొరికింది అంటూ ఈమె పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలా ఈ పాట కారణంగా మంగ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మరి ఈ విషయంపై మంగ్లీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.