Singer Parvati: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సింగర్ పార్వతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన పాటతో తెలుగు ప్రేక్షకులను ఊహించని స్థాయిలో కట్టిపడేసింది. సెలబ్రేటీ ల నుంచి నార్మల్ పీపుల్ వరకూ సింగర్ పార్వతి ని అభిమానిస్తున్నారు అని చెప్పవచ్చు. తనను కాకి లా ఉంది అన్న వారి నోటితోనే కోకిల అని గెలిపించుకునే స్థాయికి ఎదిగింది.
మొత్తానికి సింగర్ పార్వతి ఇండస్ట్రీలో సింగర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన పాటతో ఊరికి బస్సు సౌకర్యం కల్పించి ఆ గ్రామ కలలను నెరవేర్చింది. దాంతో ఎంతో మంది ప్రశంసలను పార్వతి తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సింగర్ గా అనేక చోట్ల సన్మానాలు, పలు ఇంటర్వ్యూలు ఎక్కువ అయిపోయాయి. కాగా పార్వతికి ప్రాక్టీస్ చేయడానికి సమయం లేకపోయింది.

Singer Parvati: సింగర్ పార్వతి కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తగ్గడానికి కారణం వీళ్ళే!
చివరకు తాను షో నుంచి ఎలిమినేట్ అయింది. ఈ విషయాన్ని సింగర్ పార్వతి అభిమానులు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంతే కాకుండా అందరూ చాలా బాధపడ్డారు. ఇక న్యాయనిర్ణేతల కూడా సింగర్ పార్వతికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలంటూ బాగా సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో సింగర్ పార్వతి కి తన అభిమానులు కూడా బాగా సపోర్ట్ చేశారు.
ఇక పార్వతికి కొంత టాలెంట్ ఉండడంతో ఆమె షో లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. సరిగమప సింగింగ్ రియాల్టీ షోకు వైల్డ్ కార్డు తో ఎంట్రీ తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ ప్రోమో వైపు ఒక లుక్కెయ్యండి. ఇక రాబోయే రోజుల్లో సింగర్ పార్వతి మరెన్ని పాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం సింగర్ పార్వతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ని చూసి తన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.