Singer Sunita: మ్యూజిక్ లవర్స్ కి సింగర్ సునీత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సింగర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పాటలకు ప్రాణం పోసి.. తన అద్భుత గాత్రంతో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది. ఇక ఈమె పాటలు ఒక ఎత్తయితే.. తన అందమైన చిరునవ్వు మరో ఎత్తు అని చెప్పవచ్చు.
ఇక ఎంతటి వారైనా.. సునీత చిరునవ్వు చూసి ఫిదా అవ్వాల్సిందే. సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలామంది యాక్టర్ లకు తన మాటను ధారపోసింది. మొత్తానికి సింగర్ సునీత టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతుంది. ఇక సునీత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తరచూ తనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో పంచుకొని నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక అదే క్రమంలో ప్రస్తుతం సునీత పంచుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు లో వెళుతున్న సునీతకు వెళ్లేదారిలో ఒక చెరుకు తీసే గానుగ కనిపించింది. వెంటనే అది చూసిన సునీత కారు దిగి దాన్ని తిప్పడం స్టార్ట్ చేసింది.

Singer Sunita: సునీత రోడ్డు పక్కన ఆలా చేసిన పని ఇదే!
ఆ వీడియోలో సునీత.. కావాలా చెరుకు రసం సమ్మర్ గ్లో అంటూ.. గుండ్రంగా తిరుగుతూ తన అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సునీతను కామెంట్ల రూపంలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం సునీత దీనికి సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.
View this post on Instagram
సునీత ఈ వీడియో పంచుకొని దాదాపు ఒక రోజు ముగుస్తుండగా 31,500 కు పైగా ఇష్టాలను పొందింది. ఇక సునీత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 525k ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇక మీరు కూడా ఆ ఖాతా వైపు ఒక లుక్కెయండి.